Friday, 21 October 2011

లెగ్గిన్స్ కీ బడీ కహానీ: ఫ్యాషన్ మే ఖుషీ దుకానీ

 ప్రతినిధులుగా విలసిల్లే ఆధునిక అమ్మాయిలు మొదలుకుని పల్లెటూళ్ళో సిరి మల్లె నీడలో సేదదీరే గ్రామీణ యువతులదాకా అందరినీ ఆకర్షిస్తున్న ఈ"నాటి" ఫ్యాషన్ వస్త్రం లెగ్గిన్స్. ఇక్కడ ఈ"నాటి" వస్త్రమన్నప్పుడే మీకు కొంత అర్థం అయ్యుంటుంది, ఈ లెగ్గిన్స్ ఏనాటివోనని. 

నిజ్జంగా అది నిజం. ఈరోజుల్లో అందరూ కుర్తాలు, లాంగ్ టీ-షర్ట్ లకు జోడీగా వాడుతున్న లెగ్గిన్స్ 13వ శతాభ్దం నుంచి వాడుకలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా?. కాని అది నిజం. ఇంకో గమ్మత్తైన విషయమేంటంటే లెగ్గిన్స్ రెండుకాళ్ళకూ కలుపుతూ ఇప్పుడుంటే 700ల సంవత్సరాల క్రితం రెండుకాళ్ళకు రెండు లెగ్గిన్స్ వేరువేరుగా ఉండేవి. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే లెగ్గిన్స్ ఇప్పుడు అమ్మాయిలు మాత్రమే వాడుతున్నారు కాని, అప్పట్లో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా వాడేవారు. వారికన్నా ముందు లెగ్గిన్స్ సైనికులకు రక్షణ కల్పించే వస్త్రంగా వాడారంటే మీరు నమ్ముతారా?...

అబ్బో, లెగ్గిన్స్ కు చాలా చరిత్రే ఉంది సుమీ..

 లెగ్గిన్స్ కీ 'కహానీ'...

ఆధునిక కాలంలో అత్యాధుకిన ఫ్యాషన్ గా యువతులచే వినియోగించబడుతున్న లెగ్గిన్స్ 13వ శతాభ్దం లో యూరోపియన్ దేశలలో తొలిసారి ఇతర దేశాలతో యుద్దం చేయడం కోసం వెళ్ళే సైనికుల కాళ్ళకు రక్షణ అందించే వస్త్రంగా ధరించేవారు. సైనికులు ధరించే ఆనాటి లెగ్గిన్స్ ను "గైటర్స్" అని పిలిచేవారు. ఆతరువాత రైతులు, పర్వతారోహకులు కూడా ధరించడం మొదలుపెట్టిన ఆనాటి లెగ్గిన్స్ ను మేలుజాతి జంతువుల చర్మంతో తయారు చేసేవారు. అడవులలో, నీటిలో, మట్టిలో, బురదలో, గడ్డిలో వెళ్ళే సైనికులకు ఈ వస్త్రాలు ధరించడం వల్ల క్రిమికీటకాల నుంచి రక్షణ లభించడమే కాకుండా, అంటువ్యాధుల బారిన పడకుండా వుండేవారు. ఆతరువాత 14వ శతాభ్దంలో యూరోపియన్ దేశాలలో వచ్చిన సాంస్కృతిక విప్లవంలో ఏర్పడిన "రెణాసెయిన్స్ సంస్కృతి"లో లెగ్గిన్స్ ను సాప్రదాయ వస్త్రంగా నిర్ణయించడం జరిగింది. అటునుంచి 17వ శతాభ్దందాకా యూరోపియన్ దేశాలలో రాజ వస్త్రంగా కీర్తి పొందిన లెగ్గిన్స్ వస్త్రం అటు తరువాత ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొని, 18వ శతాభ్దం నుంచి ప్రపంచ ప్రజలచేత ఆదరణ చూరగొంటోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ చూరగొన్న లెగ్గిన్స్ 17వ శతాబ్దంలోనే భారతదేశంలోకి అడుగుపెట్టింది. యూరోపియన్లు వాణిజ్యం కోసం వచ్చినప్పుడు వారి సాంప్రదాయ వస్త్రంగా ధరించే లెగ్గిన్స్ వస్త్రాన్ని ఆనాటి రాజులు, జమీందారులకు బహుమతిగా ఇచ్చేవారు. అలా భారత్ లోకి అడుగుపెట్టిన లెగ్గిన్స్ అప్పుడు అంతగా ప్రజాదరణను చూరగొనకపోయినా, ఆ తరువాత బహుళ ప్రాచుర్యం పొందింది. 1960వ దశకంలో భారతదేశంలో లెగ్గిన్స్ హాట్ ఫెవరేట్ గా మారిందనే విషయం ఆనాటి తెలుగు, తమిళ, హిందీ లేదా మరేదైనా భారతీయ చలన చిత్రం చూస్తే తెలిసిపోతుంది. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు ధరించే కథానాయకులు లెగ్గిన్స్ ను తప్పనిసరిగా ధరించేవారు. మన సినీ కథానాయకులలో ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కాంతారావు, జగ్గయ్య తదితరులంతా లెగ్గిన్స్ వస్త్రాన్ని ధరించినవారే. 


ఫ్యాషన్ మే ఖుషీ 'దుకానీ'...
లంగా-ఓణీ,చీర పోయి చుడిదారులు వొచ్చే, అవి పోయి.. ఫేంట్-షర్ట్  వొచ్చే, అవి పోయి లెగ్గిన్స్-షార్ట్ వొచ్చే..అంటూ ఈనాటి ఫ్యాషన్ వస్త్రంగా కొనియాడబడుతున్న లెగ్గిన్స్ వస్త్రం దుకాణదారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వస్త్ర దుకాణాలలో అందుబాటులో ఉంటున్న కాటన్‌, సింధటిక్‌, సిల్క్‌వస్త్రంతో తయారయ్యే లెగ్గిన్స్ ఇప్పుడు ప్రింట్స్‌, ప్యాచ్‌వర్క్‌, ఎంబ్రాయిడరీ, లక్నో ప్రింట్‌, కలంకారీ, గీతలతో అదనపు హంగులు అద్దుకుని అమ్మాయిలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో దుకాణదారులు మరింత ఉత్సాహంతో అమ్మాయిలు మెచ్చే మేలురకం డిజైన్లతో తమ దుకాణాలను అలంకరిస్తూ కాసులపంట పండించుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోబాటు హైదరాబాద్ జంటనగరాలలో లెగ్గిన్స్ లేని షాపు దాదాపు ఉండదంటే ఈ లెగ్గిన్స్ కు ఉన్న ఫాలోయింగ్ ను అర్థం చేసుకోవచ్చు. జంటనగరాలలోని కోటి, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్లలో అతి తక్కువ ధరల్లో కూడా ఈ లెగ్గిన్స్ లభిస్తుండటం ఫ్యాషన్స్ ను ఇస్టపడే యువత్లకు సంతోషాన్ని కలిగిస్తోంది. దాంతో లెగ్గిన్స్ కీ కహానీ డ్రీం లైట్ వెన్నెళ్ళో కొత్తకాంతులీనుతోంది.



తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర

శ్రీకృష్ణుని అష్టభార్యలలో సత్యభామ పాత్ర చిత్రణ తెలుగునాట సాహిత్యంలో విశిష్టమైన పాత్ర సంతరించుకొంది. స్వాధీనపతికయైన నాయిక గాను, సరస శృంగారాభిమానవతిగాను, విభునికి తనపైనున్న ప్రేమకారణంగా గర్వం మూర్తీభవించినదానిగాను సత్యభామ పాత్రను చిత్రీకరించారు.పోతన భాగవతంలో నరకాసుర వధ సందర్భంగా సత్యభామ పాత్రను అందమైన పద్యాలలో చిత్రీకరించాడు. యుద్ధం సమయంలో ఆమె హరునికి ప్రియశృంగారమూర్తిగాను, శత్రువుకు భీకర యుద్ధమూర్తిగాను ఒకేమాఱు దర్శనమిచ్చిందట..
నంది తిమ్మన పారిజాతాపహరణం, కూచిపూడి నాట్యం, భామా కలాపం వంటి వాటిలో సత్యభామ పాత్ర చిత్రీకరణ జరిగింది. నంది తిమ్మన పారిజాతాపహణంలో సత్యభామ పాత్రను చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. సత్యభామ సత్రాజిత్తు కుమార్తె. శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు. ఈమె భూదేవి అవతారమని విశ్వసిస్తారు. గోదాదేవి సత్యభామ అవతారమని అంటారు. భాగవతం దశమ స్కంధంలో సత్యభామ వృత్తాంతంలో నరకాసుర వధను ప్రముఖంగా చెప్పారు. అందులో చెప్పిన విషయాలు శ్యమంతకోపాఖ్యానం, నరకాసుర వధ, పారిజాతాపహరణం, శ్రీకృష్ణ తులాభారం.

వినాయక వ్రత కల్ప విధానంలో చదివే వ్రతకథలోని శ్యమంతకోపాఖ్యానం ద్వారా సత్యభామ పరిణయవృత్తాంతం హిందువులకు సుపరిచితం. సత్రాజిత్తు సూర్యోపాసనచే శ్యమంతకమనే మణిని సంపాదించినాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు అడవికి వెళ్ళినాడు. సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది. నిజం తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభంతో శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి మణిని అపహరించాడని అనుమానించి నిందన పాలు చేసాడు. ఆ నింద నుంచి బయటపడడం శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించి, జాంబవంతుని ఓడించి, మణిని తీసుకుని నగరానికి వెళ్ళి పురజనులను రావించి జరిగిన వాస్తవాన్ని వివరించి నింద నుంచి శ్రీకృష్ణుడు బయటపడ్డాడు. నిజం తెలిసిన సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది మణిని ఇవ్వడమే కాకుండా తన కూతురు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం చేశాడు. ధర్మబుద్ధితో శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. అలా సత్యభామను కృష్ణునికిచ్చి పెళ్ళి చేసినందుకు కోపించిన శతధన్వుడు తరువాత కాలంలో సత్రాజిత్తును సంహరించాడు.

శ్రీకృష్ణునికి సత్యభామ ద్వారా కలిగిన సంతతి - భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, కలిభానుడు, శ్రీభానుడు. తెలుగునాట అధిక ప్రచారంలో ఉన్న కథ ప్రకారం నరకాసురుడు తన తల్లి తప్ప వేరొకరితో మరణం లేకుండా వరం పొందాడు. ఈ సంగతి తెలిసిన కృష్ణుడు యుద్ధంలో మూర్ఛపోయినట్లు నటించగా, భూదేవి అవతారమైన సత్యభామ ధనుస్సు ఎక్కుపెట్టి వదలిన బాణంతో నరకుడు మరణించాడు.

Welcome to the VB Focus

Hi,
Dear Friends, Dears and Nears,

Now you can enjoy with my new innovative and informative! blog.

Yours,
S. Someshwar Thakur Bahadur