ప్రతినిధులుగా విలసిల్లే ఆధునిక అమ్మాయిలు మొదలుకుని పల్లెటూళ్ళో సిరి మల్లె నీడలో సేదదీరే గ్రామీణ యువతులదాకా అందరినీ ఆకర్షిస్తున్న ఈ"నాటి" ఫ్యాషన్ వస్త్రం లెగ్గిన్స్. ఇక్కడ ఈ"నాటి" వస్త్రమన్నప్పుడే మీకు కొంత అర్థం అయ్యుంటుంది, ఈ లెగ్గిన్స్ ఏనాటివోనని.
నిజ్జంగా అది నిజం. ఈరోజుల్లో అందరూ కుర్తాలు, లాంగ్ టీ-షర్ట్ లకు జోడీగా వాడుతున్న లెగ్గిన్స్ 13వ శతాభ్దం నుంచి వాడుకలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా?. కాని అది నిజం. ఇంకో గమ్మత్తైన విషయమేంటంటే లెగ్గిన్స్ రెండుకాళ్ళకూ కలుపుతూ ఇప్పుడుంటే 700ల సంవత్సరాల క్రితం రెండుకాళ్ళకు రెండు లెగ్గిన్స్ వేరువేరుగా ఉండేవి. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే లెగ్గిన్స్ ఇప్పుడు అమ్మాయిలు మాత్రమే వాడుతున్నారు కాని, అప్పట్లో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా వాడేవారు. వారికన్నా ముందు లెగ్గిన్స్ సైనికులకు రక్షణ కల్పించే వస్త్రంగా వాడారంటే మీరు నమ్ముతారా?...
అబ్బో, లెగ్గిన్స్ కు చాలా చరిత్రే ఉంది సుమీ..
లెగ్గిన్స్ కీ 'కహానీ'...
ఆధునిక కాలంలో అత్యాధుకిన ఫ్యాషన్ గా యువతులచే వినియోగించబడుతున్న లెగ్గిన్స్ 13వ శతాభ్దం లో యూరోపియన్ దేశలలో తొలిసారి ఇతర దేశాలతో యుద్దం చేయడం కోసం వెళ్ళే సైనికుల కాళ్ళకు రక్షణ అందించే వస్త్రంగా ధరించేవారు. సైనికులు ధరించే ఆనాటి లెగ్గిన్స్ ను "గైటర్స్" అని పిలిచేవారు. ఆతరువాత రైతులు, పర్వతారోహకులు కూడా ధరించడం మొదలుపెట్టిన ఆనాటి లెగ్గిన్స్ ను మేలుజాతి జంతువుల చర్మంతో తయారు చేసేవారు. అడవులలో, నీటిలో, మట్టిలో, బురదలో, గడ్డిలో వెళ్ళే సైనికులకు ఈ వస్త్రాలు ధరించడం వల్ల క్రిమికీటకాల నుంచి రక్షణ లభించడమే కాకుండా, అంటువ్యాధుల బారిన పడకుండా వుండేవారు. ఆతరువాత 14వ శతాభ్దంలో యూరోపియన్ దేశాలలో వచ్చిన సాంస్కృతిక విప్లవంలో ఏర్పడిన "రెణాసెయిన్స్ సంస్కృతి"లో లెగ్గిన్స్ ను సాప్రదాయ వస్త్రంగా నిర్ణయించడం జరిగింది. అటునుంచి 17వ శతాభ్దందాకా యూరోపియన్ దేశాలలో రాజ వస్త్రంగా కీర్తి పొందిన లెగ్గిన్స్ వస్త్రం అటు తరువాత ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొని, 18వ శతాభ్దం నుంచి ప్రపంచ ప్రజలచేత ఆదరణ చూరగొంటోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ చూరగొన్న లెగ్గిన్స్ 17వ శతాబ్దంలోనే భారతదేశంలోకి అడుగుపెట్టింది. యూరోపియన్లు వాణిజ్యం కోసం వచ్చినప్పుడు వారి సాంప్రదాయ వస్త్రంగా ధరించే లెగ్గిన్స్ వస్త్రాన్ని ఆనాటి రాజులు, జమీందారులకు బహుమతిగా ఇచ్చేవారు. అలా భారత్ లోకి అడుగుపెట్టిన లెగ్గిన్స్ అప్పుడు అంతగా ప్రజాదరణను చూరగొనకపోయినా, ఆ తరువాత బహుళ ప్రాచుర్యం పొందింది. 1960వ దశకంలో భారతదేశంలో లెగ్గిన్స్ హాట్ ఫెవరేట్ గా మారిందనే విషయం ఆనాటి తెలుగు, తమిళ, హిందీ లేదా మరేదైనా భారతీయ చలన చిత్రం చూస్తే తెలిసిపోతుంది. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు ధరించే కథానాయకులు లెగ్గిన్స్ ను తప్పనిసరిగా ధరించేవారు. మన సినీ కథానాయకులలో ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కాంతారావు, జగ్గయ్య తదితరులంతా లెగ్గిన్స్ వస్త్రాన్ని ధరించినవారే.
ఫ్యాషన్ మే ఖుషీ 'దుకానీ'...

లంగా-ఓణీ,చీర పోయి చుడిదారులు వొచ్చే, అవి పోయి.. ఫేంట్-షర్ట్ వొచ్చే, అవి పోయి లెగ్గిన్స్-షార్ట్ వొచ్చే..అంటూ ఈనాటి ఫ్యాషన్ వస్త్రంగా కొనియాడబడుతున్న లెగ్గిన్స్ వస్త్రం దుకాణదారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వస్త్ర దుకాణాలలో అందుబాటులో ఉంటున్న కాటన్, సింధటిక్, సిల్క్‌వస్త్రంతో తయారయ్యే లెగ్గిన్స్ ఇప్పుడు ప్రింట్స్, ప్యాచ్‌వర్క్, ఎంబ్రాయిడరీ, లక్నో ప్రింట్, కలంకారీ, గీతలతో అదనపు హంగులు అద్దుకుని అమ్మాయిలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో దుకాణదారులు మరింత ఉత్సాహంతో అమ్మాయిలు మెచ్చే మేలురకం డిజైన్లతో తమ దుకాణాలను అలంకరిస్తూ కాసులపంట పండించుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోబాటు హైదరాబాద్ జంటనగరాలలో లెగ్గిన్స్ లేని షాపు దాదాపు ఉండదంటే ఈ లెగ్గిన్స్ కు ఉన్న ఫాలోయింగ్ ను అర్థం చేసుకోవచ్చు. జంటనగరాలలోని కోటి, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్లలో అతి తక్కువ ధరల్లో కూడా ఈ లెగ్గిన్స్ లభిస్తుండటం ఫ్యాషన్స్ ను ఇస్టపడే యువత్లకు సంతోషాన్ని కలిగిస్తోంది. దాంతో లెగ్గిన్స్ కీ కహానీ డ్రీం లైట్ వెన్నెళ్ళో కొత్తకాంతులీనుతోంది.
No comments:
Post a Comment